బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ సౌతాఫ్రికాకి చెందిన గాబ్రియేలాతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ 24 ఏళ్ళ వయస్సులో మెహర్ జెస్సియాని వివాహం చేసుకున్నారు. వీరి బంధానికి సాక్షిగా మహిక (17), మైరా (13) అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అయితే పలు కారణాల వలన గత ఏడాది అర్జున్ రాంపాల్, మెహర్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి సౌతాఫ్రికాకి చెందిన గాబ్రియేలాతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె ఇటీవల మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తాజాగా బంద్రాలోని కోర్టు వీరిద్దరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. పిల్లలు ఇద్దరిని తల్లి వద్దే ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2009లో మిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ బాలీవుడ్‌లో పాల్గొన్న సమయంలో అర్జున్ రాంపాల్‌తో గాబ్రియెల్లాకి పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమగా మారడంతో అప్పటి నుండి వారిరివురు సహజీవనం చేస్తున్నారు. నాగార్జున ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది గాబ్రియేలా.
previous post
next post