telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్‌ : ఏలూరుకు కేంద్ర ప్రభుత్వ బృందం..

ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు… స్పృహ కోల్పోవడం, మెడ, నడుం నొప్పి, తల కళ్లు తిరగడం లాంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలనున బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. అయితే.. ఒక్కసారి ఇంత మంది ఇలా అస్వస్థతకు గురవడానికి కారణాలేంటో ఇప్పటికి స్పష్టత రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆస్పత్రిలో చేరగా… ఇవాళ ఉదయం వరకు ఆ సంఖ్య కాస్త 350 కి చేరుకుంది.ఈ నేపథ్యంలో ఏలూరుకు కేంద్ర ప్రభుత్వ బృందం రానుంది. అంతుచిక్కని వ్యాధి మీద కేంద్ర బృందం ఆరా తీయనుంది. NHDC నుండి ముగ్గురు ప్రతినిధులు ఏలూరు రానున్నారు. ఇప్పటి దాకా వ్యాధి, కారణాలు, మూలాలు గుర్తించలేకపోయారు వైద్యులు. కాగా.. ఇప్పటికే సీఎం జగన్‌ ఏలూరు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Related posts