telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్‌2 నుంచి మరో అదిరిపోయే అప్డేట్

క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం క‌న్న‌డ‌లోనే కాక తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో మంచి విజ‌యం సాధించింది. దాదాపు 200 కోట్ల‌కి పైగా కలెక్ష‌న్స్ సాధించి అన్ని ఇండ‌స్ట్రీల‌ని షాక్‌కి గురి చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌వీనా టాండన్.. ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఈ రోజు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పమంటూ హంబోలే ఫిలింస్‌ ట్వీట్‌ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల 32 నిమిషాలకు సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు.

Related posts