రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మళ్ళీ వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేది వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ మూవీ ఇపుడు మరోసారి వాయిదా పడ్డట్టు సమాచారం.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో ముఖ్యమైన ఘట్టాన్ని చిత్రికరిస్తున్నారు.ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ తో చిత్రబృందం బిజీగా ఉంది. నిజానికి ఈ పాట షూటింగ్ నిన్ననే పూర్తి కావాలి కానీ కొన్నిపరిస్థితులు వల్ల షూటింగ్ వాయిదా పడటంతో చిత్ర బృందం మరొక వారం పాటు ఉక్రెయిన్లోనే ఉండాల్సి వస్తోంది.
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన హీందీ నటి అలియా భట్, అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది. ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చాక రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి అందులో సినిమాకి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు అని తెలుస్తోంది. దీంతో ఒక విధంగా స్టార్ హీరోలఅభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.