telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో కాటంరాయుడు రీమేక్ .. అద్భుతంగా అక్షయ్ లుక్ ..

katamarayudu remake by akshai kumar

ప్రస్తుతం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది బడా బడా హీరోలు మనసులు పారేసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో భయంకరమైన ప్లాపులు చూసిన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు తాజాగా షాహిద్ కపూర్ లాంటి వారు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి సూపర్ హిట్ ట్రాక్ లోకి రావటం మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమా నీ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘బచ్చన్‌ పాండే’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమానే పవన్ కళ్యాణ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అజిత్ నటించిన వీరం సినిమా రీమేక్గా తెలుగులో కాటంరాయుడు గా నటించడం జరిగింది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఓ మాదిరిగా ప్రేక్షకులను అలరించింది. దీంతో అక్షయ్ కుమార్ ఈ సినిమాపై గురిపెట్టి ఎలాగైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఆలోచనతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాని సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తుండగా.. ఫర్హాద్ సామ్జి డైరెక్ట్ చెయ్యనున్నాడు. ప్రస్తుతం హిందీ నేపథ్యానికి తగ్గట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసారు. ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం అక్షయ్కుమార్ బాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ వంటి సినిమాల షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా వచ్చే ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖున అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలో పైనున్న రెండు ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చాక పవన్ కాటమరాయుడు రీమేక్ ‘బచ్చన్‌ పాండే’ సినిమా షూటింగ్ లో అక్షయ్ కుమార్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related posts