ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “మిషన్ మంగళ్”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్‌యాన్’ మిషన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని జగన్ శక్తి తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఇందులో రాకేష్ పాత్ర పోషిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్ కథ ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను జోరుగా చేస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. మీరు కూడా ఈ కొత్త ట్రైలర్ ను వీక్షించండి
previous post