telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోహన్ లాల్ ‘మరక్కార్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన మెగా స్టార్

marakkar

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరక్కార్’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో మలయాళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 26న విడుదలవుతోంది. ‘అరేబియా సముద్ర సింహం’ అనేది ఈ చిత్ర టైటిల్‌కు ట్యాగ్ లైన్. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం అన్ని భాషల్లోనూ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇక తమిళ ట్రైలర్‌ను సూర్య, కన్నడ ట్రైలర్‌ను యశ్, హిందీ ట్రైలర్‌ను అక్షయ్ కుమార్ లాంచ్ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల బ‌డ్జెట్‌తో నిర్మించారు.16వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి కుంజ‌లి మ‌ర‌క్కార్ జీవిత క‌థ ఆధారం. కాగా, ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్, యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, ఫాజిల్, సిద్ధిఖి, నేదుముడి వేణు, ఇన్నోసెంట్, అశోక్ సెల్వన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటొని పెరుంబవూర్ ఈ సినిమాను నిర్మించారు. రోనీ రాఫెల్ సంగీతం సమకూర్చారు. ‘బాహుబలి’కి పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్. తిరు సినిమాటోగ్రఫీ అందించారు.

Related posts