telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్రిష వెరైటీ స్పందన… పెళ్లిపై నమ్మకం లేదంటూనే…!

trisha

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కు దూరమైపోయింది. కానీ త్రిష‌ చివ‌రిగా న‌టించిన 96, పేట చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకి కోలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం. దాదాపు ఇరవయ్యేళ్లుగా వెండితెరపై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది చెన్నై బ్యూటీ త్రిష. ఇప్పటికీ ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ, చిరంజీవి 152వ చిత్రంలోనూ, మోహన్‌లాల్‌తో ‘రామ్‌’ సినిమాలోనూ నటిస్తోంది. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన త్రిష పెళ్లి గురించి స్పందించింది. `మీరు వివాహ వ్యవస్థను నమ్ముతారా?` అని ఓ వ్యక్తి త్రిషను ప్రశ్నించారు. దీనికి `వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం లేదనుకుంటున్నాను` అంటూ త్రిష సమాధానమిచ్చింది. అలాగే `మీ క్రేజీ డ్రీమ్ ఏంటి?` అనే ప్రశ్నకు స్పందిస్తూ.. `లాస్‌వేగాస్‌లో వివాహం చేసుకోవడం` అని జవాబిచ్చింది. వివాహ వ్యవస్థపై నమ్మకం లేదంటూనే.. వేగాస్‌లో పెళ్లి చేసుకోవాలనుందని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Related posts