telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సిన్…

corona vaccine

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు వ్యతిరేకంగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ అంచనా వేసిన సమయం కంటే ముందే రావొచ్చని ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు పేర్కొన్నారు. ఇప్పటి దాకా వచ్చిన రిపోర్ట్ లు, చేసిన పరీక్షల ప్రకారం ఈ వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని, ఫిబ్రవరి నాటికి కచ్చితంగా వ్యాక్సిన్ ని అందిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ప్రభుత్వం సారధ్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తో కలిసి కోవాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ అనే ప్రైవేటు సంస్థ, ఈ వ్యాక్సిన్ ని వచ్చే ఏడాది సెకండ్ క్వార్టర్ లో మాత్రమే విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇక మరో పక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ జనవరి నుంచి అందుబాటులోకి రాబోతున్నట్టు సీరం ఇన్సిట్యూట్ అఫ్ ఇండియా సీఈవో పూనావాలా తెలిపారు.  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి సీరం ఇన్సిటిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను డెవలప్ చేస్తున్నాయి. అనుమతులు రావాల్సి ఉందని, అనుమతులు వస్తే జనవరి నుంచి ఉత్పత్తి మొదలుపెడతామని అంటున్నారు.  ఉత్పత్తులు ప్రారంభించాక నెలకు 60నుంచి 70 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయాలని, క్రమంగా ఆ సంఖ్యను 100 మిలియన్ కు పెంచాల్సి ఉంటుందని తెలిపారు.

Related posts