telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

జపాన్‌ను మరోసారి అతలాకుతలం చేసిన భూకంపం..

జపాన్ రాజధాని టోక్యోకు 220 కిలోమీటర్ల దూరంలోని ఫుకుషిమా తీరంలో తీవ్ర భూకంపం సంభవించింది.. దాని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.1గా నమోదైనట్టు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇక, ఇలాంటి భూకంపాలు వచ్చినప్పుడు.. సునామీ హెచ్చరికలు ఉంటాయి.. కానీ, ఎలాంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేశారు అధికారులు.. టోక్యోతోపాటు పలు నగరాల్లో భూకంప ప్రభావం ఉండదని.. దీంతో.. 8.30 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నట్టు తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగినట్టు ఎలాంటి వార్తలు వెలువడలేదు.. ఇక, ఫుకుషిమాలోని అణు కేంద్రాలకు కూడా ఎలాంటి ముప్పులేదని జపాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా 2011 మార్చిలో ఫుకుషిమాలో భూకంపం, సునామితో జపాన్ వణికిపోయింది.. సుమారు 19 వేల మంది మృతిచెందారు. మరో నెల రోజుల్లో ఈ ఘటనకు 10 సంవత్సరాలు నిండనున్నాయి.. దీనికి మూడు వారాల ముందు. మళ్లీ భూకంపం వణికిచింది. టెలివిజన్ ఫుటేజ్ ప్రకారం, సెంట్రల్ ఫుకుషిమా నగరంలోని భవనాలకు పెద్ద నిర్మాణ నష్టం జరిగినట్లు కనిపించలేదు. నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ప్రధాని ఆదేశించారు. అయితే జపాన్ లో ఇప్పటికే చాలాసార్లు భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts