telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గోవాలో అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున ఇప్పుడు హైద్రాబాద్లో కన్నా గోవా లోనే ఎక్కువ రోజులు ఉంటున్నాడని తెలుస్తోంది . గత సంవత్సరం నాగార్జున గోవా లో ఇల్లు నిర్మించుకున్నారు. హాలిడేస్ కు గోవా వెళ్ళినప్పుడు ఈ ఇంట్లో ఉండవచ్చనే ఉద్దేశ్యం తోనే ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారని సినిమా రంగంలో అందరూ భావించారు.
గత సంవత్సరం నాగార్జున నటించిన “ది ఘోస్ట్” సినిమా ఊహించని పరాజయం పొందింది .

నాగ చైతన్య నటించిన “కస్టడీ”, అఖిల్ నటించిన “ఏజెంట్ ” సినిమాలను నాగార్జున ఎంతో ప్రమోట్ చేశారు . అయినా ఆ సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చలేదు.
నాగ చైతన్య , సమంత విడాకులు, అఖిల్ కు వివాహం కుదరక పోవడం .. ఇవ్వన్నీ నాగార్జునను మానసికంగా కృంగదీశాయని , అందుకే హైదరాబాద్ ను విడిచి గోవా లో వుంటున్నారని తెలుస్తోంది .

Related posts