telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోలందరి కన్నా అధికంగా లారెన్స్ విరాళం

Raghava-Lawrence

తమిళనాట స్టార్ హీరోలు అందరి కన్నా అధికంగా కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు అయిన రాఘ లారెన్స్ రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే లారెన్స్.. సొంతంగా ఛారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. తన ట్రస్ట్ ద్వారా దివ్యాంగులను ఆదుకుంటున్నారు. తాను విరాళంగా ప్రకటించిన రూ.3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నారు. అలాగే, దివ్యాంగులకు రూ.25 లక్షలు ప్రకటించారు. తన స్వస్థలం చెన్నైలోని రోయపురంలోని పేద ప్రజల కోసం రూ.75 లక్షల సాయం అందజేస్తున్నారు.

Related posts