telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్విట్ బాలీవుడ్ : ప్రముఖ దర్శకుడి రాజీనామా

Anubhav Sinha

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తరువాత నెపోటిజంపై బాలీవుడ్ లో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్‌లోని నెపోటిజం వలనే సుశాంత్‌, ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు సెలెబ్రిటీలతో పాటు ఆయన అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు. కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి వారు సైతం బాలీవుడ్‌ కొంత మంది చేతుల్లోనే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ‘క్విట్ బాలీవుడ్’ తెరపైకి వచ్చింది. “థప్పడ్” దర్శకుడు అనుభవ్ సిన్హా..” చాలు.. నేనిక ఇక్కడ ఉండలేను.. బాలీవుడ్ నుంచి రాజీనామా చేస్తున్నా…” అని ట్వీట్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా కూడా బాలీవుడ్ చోడో అంటూ ట్వీట్ చేశారు. తాము ఇండస్ట్రీలోకి ప్రసిద్ధ దర్శకులను చూసి వచ్చామని వారు ట్వీట్ చేశారు.

Related posts