telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన: మంత్రి గౌతమ్ రెడ్డి

Mekapati ycp

అవినీతికి చోటివ్వని పారిశ్రామిక విధానానికే తమ ప్రాధాన్యత అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు నిర్వహించిన ఇండస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల 26న కొత్త పారిశ్రామిక విధానం ఖరారు చేస్తామని తెలిపారు. నూతన విధానం అమల్లోకి వస్తే కేవలం 30 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు వస్తాయని వివరించారు. నాలుగు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఏపీలో సరికొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నట్టు తేలిపారు.

పరిశ్రమలకు అవసరమైన అన్ని వనరులు సమకూర్చుతామని, స్థలం, నీరు, విద్యుచ్ఛక్తి, నిపుణతతో కూడిన మానవ వనరులు అందిస్తామని తెలిపారు. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని అన్నారు. 

Related posts