telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తెలంగాణ తెలుగు దేశానికి బాలయ్య సారథ్యం

ఇక నుంచి తెలంగాణ తెలుగు దేశము పార్టీకి దశ, దిశను నందమూరి బాలకృష్ణ నిర్దేశిస్తారా ? అవుననే చెప్పాలి . చంద్ర బాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో క్షణం తీరికలేకుండా వున్నారు . తెలంగాణ తెలుగు దేశం పార్టీకి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించారు . బి .సి నాయకుడు కాబట్టి ఆ వర్గాల ఓట్లు కోసం బాబు నియమించారు . అయితే కాసాని పట్ల అందరూ విధేయంగా ఉండటం లేదు . పార్టీలో అసంతృప్తి వుంది . అయినా తెలంగాణ రాజకీయ నాయకులకు బాబు తగిన సమయం ఇవ్వడం లేదు . ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది .
తమ తండ్రి నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని ప్రారంభించింది హైదరాబాద్ నుంచి. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు తెలంగాణాలో ఉనికిని కోల్పోతుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్న వేళ బాలకృష్ణ ఇక్కడ కార్య కర్తలు , నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలనుకుంటున్నారు .
బావ చంద్ర బాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో బిజీగా వుంటున్నారు . వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు . అల్లుడు నారా లోకేష్ కూడా యువ గళం యాత్రలో పాల్గొంటున్నాడు . అందుకే తెలంగాణ తెలుగు దేశం బాధ్యతలు బాలకృష్ణ స్వీకరించారని తెలుస్తోంది . తెలంగాణాలో వున్న సమస్యలను తెలుసుకుంటూ , నాయకులను పిలిపించుకొని , వారితో మాట్లాడుతున్నారట .
ఎన్ .టి .ఆర్ శత జయంతి ఉత్సవాలు గత నెల 20న హైద్రాబాద్ లో జరిగినప్పుడు , ఆ వేదిక చంద్ర బాబు నాయుడు వున్నా , అంతా తానై బాలకృష్ణ నడిపించారు . ఈ విషయంలో చంద్ర బాబు నాయుడు కూడా జోక్యం చేసుకోలేదు. పైగా బాలకృష్ణ తానంతట తాను తెలంగాణ రాజకీయాలు చూస్తానంటే బాబు ఎందుకు వద్దంటారు. బాలకృష్ణ సంగతి చంద్ర బాబుకు బాగా తెలుసు . అతను దేనికైనా డిసైడ్ అయితే … వెనక్కు తగ్గడు . కాకపోతే తెలంగాణ తెలుగు దేశం నాయకులు మాత్రం కలవరపడుతున్నారు .
ఏదైనా విషం గురించి చంద్ర బాబు నాయుడు గారికి చెబితే వింటారు . కానీ బాలకృష్ణ మాత్రం నేను చెప్పిందే వినమంటాడు. సమస్యను అర్ధం చేసుకోడు, చెప్పింది వినరు, ఇలా ఐతే రాజకీయాల్లో ఎలా నెగ్గుకు రాగలం అంటున్నారు .
ఆంధ్ర రాజకీయాల్లో బావ చంద్ర బాబు , తెలంగాణ రాజకీయాల్లో బావ మరిది బాల కృష్ణ పార్టీ కోసం పనిచేస్తారు .

Related posts