telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్..

corona vaccine India

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.62 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. అందులో ఏపీలో కొత్తగా 1160 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,62,213 కి చేరింది. ఇందులో 8,41,026 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 14,249 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 11 మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6938 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 46, చిత్తూరులో 130, తూర్పుగోదావరి జిల్లాలో 134, గుంటూరులో 164, కడపలో 60, కృష్ణాలో 167, కర్నూలులో 21, నెల్లూరులో 26, ప్రకాశంలో 64, శ్రీకాకుళంలో 67, విశాఖపట్నంలో 77, విజయనగరంలో 23, పశ్చిమ గోదావరిలో 142 కేసులు నమోదయ్యాయి.

Related posts