ఉత్తరాంధ్రకు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులూ భారీవర్ష సూచన ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 72గంటల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాలలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
అల్ప పీడనం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారనుందని.. సముద్ర అలలు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ బుజ్జగింపు రాజకీయాలు: అమిత్షా