telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దున్నపోతుకు కూడా ఏమి రాజయోగం..అందుకే దాని ఖరీదు 14కోట్లా..

14 crore Buffalo

సాధారణంగా పశువులు కాస్త ఎక్కువ ధర పలుకుతుండటం సహజం. కానీ కోట్లు ఉంటాయా అంటే ఆలోచించాల్సిందే. ఒక దున్నపోతుకు మాత్రం ఆ ప్రత్యేకత దక్కింది. దాని రేటు చెప్తే గుడ్లు తేలేస్తారు. ఒకటి కాదు, రెండు కాదు.. అక్షరాలా 14 కోట్ల రూపాయల విలువైన దున్నపోతు. 1,300 కిలోల బరువున్న ఈ దున్న రాజస్థాన్‌లోని నాగోరీ పశుమేళాలో సెంటారఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి ముద్దుగా భీమ్‌ అని పేరు పెట్టారు. ముర్రా జాతికి చెందిన భీమ్ కండలు చూస్తే పరేషాన్ అవుతారు.

ప్రస్తుతానికి దాని విలువ మార్కెట్‌లో రూ.14 కోట్లు. అయినప్పటికీ యజమాని అమ్మదలుచుకోవడం లేదు అంటున్నాడు. దాని తిండికోసం రోజుకు మూడు, నాలుగు వేలు ఖర్చు పెడుతున్నాడు. ఉదయాన్నే దీనికి నూనెలతో స్పెషల్ మసాజ్ చేస్తాడట.

Related posts