telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వేడెక్కిన బెంగాల్ రాజకీయాలు : సీబీఐ ఆఫీసుకు మమతా బెనర్జీ

మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ గెలువకపోయినా.. సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు మమతా బెనర్జీ. అయితే ఎన్నికలు ఐపోగానే.. బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. మమతా బెనర్జీ కేబినెట్ మంత్రిని ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సిఎం మమతా బెనర్జీ తో సహా టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓటమిని బిజేపి ఓర్చుకోలేక పోతుందని.. అందుకే తమ నేతలను అరెస్ట్ చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హకీంను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నారద కుంభకోణం కేసులో మంత్రి ఫిర్హాద్ హకీంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్ హకీం.. మమతా బెనర్జీ కేబినెట్ లో రవాణా శాఖ మంత్రి. ఫిర్హాద్ హకీంతో పాటు ఈ కేసులో మదన్ మిత్రా, సుబ్రతా ముఖర్జీ, సోవన్ చటర్జీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వీరిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సిఎం మమతా బెనర్జీ తో సహా టీఎంసీ కార్యకర్తలు సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Related posts