ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది. సుధీర్ఘ విచారణ అనంతరం విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు అచ్చెన్న తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
కాగా సోమవారం నాడు ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగనున్నాయి. వివిధ పత్రాలను పరిశీలించాల్సి ఉండటంతో విచారణను హైకోర్టు సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.