telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో 100 దాటినా పెట్రోల్ ధర…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సెంచ‌రీ దాటేసింది పెట్రోల్ ధ‌ర. విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర మండిపోతోంది.. బెజ‌వాడ‌లో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధ‌ర రూ.102.47కు పెరిగింది.. ఇక‌, లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.94.12గా ప‌లుకుతోంది.. గత నాలుగు రోజులుగా వ‌రుస‌గా పెరుగుతూ సామాన్యుల‌కు గుబులు పుట్టిస్తున్నాయి పెట్రోల్ ధ‌ర‌లు. అయితే, క్రూడాయల్ నుండి రిపైడ్ చేసి మనకి వచ్చేసరికి వర్జినల్ కాస్ట్ లీట‌ర్‌కు రూ.34గా ఉంది.. మిగిలినవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టాక్సులే… ట్రాన్స్‌పోర్ట్ 28 పైసలు అయితే, ఎక్సైజ్ సుంకం రూ.32.90, డీల‌ర్ క‌మిష‌న్ రూ.3.45, స్టేట్ వ్యాట్ 31 శాతం అంటే రూ.21.47, సెస్ రూ.4.. అన్ని కలిపి సెంచూరి ద‌గ్గ‌ర‌కు నార్మల్ పెట్రోల్ ధర చేర‌గా.. స్పీడ్ అయితే ఇప్ప‌టికే వంద దాటేసింది.. ఇక‌, డీజిల్ ధ‌ర విష‌యానికి వ‌స్తే.. అస‌లు ధ‌ర లీట‌ర్‌కు రూ.38.35కాగా.. ఎక్సైజ్ సుంకం.. రూ.31.81, డీలర్ కమిషన్ రూ.2.25, ఎల్ఎస్ఆర్ 36 పైసలు, వ్యాట్ రూ.15.96, రోడ్ టాక్స్ రూ.1గా ఉంది.

Related posts