telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలి: సీఎం జగన్

cm jagan ycp

పేద విద్యార్థులను కూడా ఉన్నత చదువులు చదివించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ రోజు విద్యా రంగంపై నిర్వహిస్తోన్న సదస్సులో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ప్రభుత్వం రోజుకో విషయంపై మేథోమథన సదస్సు నిర్వహిస్తోందన్నారు. చాలా మంది తమ పిల్లలను చదివించే స్తోమత లేక మధ్యలోనే ఆపుతున్నారు.

ఫీజుల కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతాఇంతాకాదు. కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చదువుల కోసం తండ్రి పడుతున్న అప్పుల బాధను భరించలేక అతడు ఆ చర్యకు పాల్పడ్డాడు. మంచి చదువులు చదవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు చదవలేకపోతున్నారని జగన్ అన్నారు.

పేదవారి కుటుంబంలో పిల్లలు కలెక్టరో, లేదా ఓ పెద్ద ఉద్యోగమో చేస్తే పేదరికం నుంచి బయటకు వస్తారు. లేదంటే ఎప్పటికీ వారు పేదరికంలోనే ఉంటారు. పేదరికానికి ఉన్న ఏకైన సొల్యూషన్ చదువు. పిల్లలను చదివించలేకపోతోన్న తల్లిదండ్రులు ఉన్న ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. అందుకే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఇంగ్లిషు మీడియంను తీసుకు వస్తున్నామని తెలిపారు.

Related posts