ప్రతి రాష్ట్ర సినీ పరిశ్రమ కూడా ఇతర పరిశ్రమలతో పోటీ పడుతూ సరికొత్త కథలను సిద్దం చేస్తున్నారు. అదే తరహాలో భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా మడ్ రేస్ నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి సినిమా మడ్డీ. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రగభల్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈరోజు తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయింది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను స్టార్ దర్శకుడు అనిల్ రావిపుడి విడుదల చేశారు. ఈ టీజర్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మడ్ రేస్‌పై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను ఇతర భాషల్లో అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి, శివ రాజ్‌కుమార్ విడుదల చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఈ స్పీమా అభికిమానులు ఆకట్టుకుందా… లేదా అనేది.
previous post