పవన్ కళ్యాణ్ హీరో అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అలా తెలుగులో మహానటులు రామారావు గారు , నాగేశ్వర రావు గారే ” అని పోసాని గర్జించారు .
జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ “రిపబ్లిక్ ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన విమర్శలకు పోసాని కృష్ణ మురళి ధీటుగా సోమవారవు రోజు సమాధానాలు చెప్పారు .
“నా దృష్టిలో హీరోలంటే ఎన్ .టి . రామారావు , అక్కినేని నాగేశ్వర రావు , వాళ్ళిద్దరి సినిమాలు విడుదలైతే సూపర్ కలెక్షన్స్ . ఆ మహా నటులతో పోల్చుకుంటే మనకు 10 శాతం వసూళ్లు కూడా వుండవు. అయినా ఆ ఇద్దరు నటులు ఒక్క రూపాయి కూడా పెంచలేదు .
(మా) కు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి మూడు రూపాయల టికెట్ 15 రూపాయలు చెయ్యమనలేదు , పంపిణీదారులు వ్యవహారంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు ” అంటూ పోసాని కృష్ణ మురళి ధ్వజం ఎత్తారు .
” అలాగే రామారావు , నాగేశ్వర రావు నిర్మాతల విషయంలో ఎప్పుడూ వేలు పెట్టలేదు , నేను చెప్పింది నిజమో కాదో పవన్ కళ్యాణ్ కనుక్కోండి ” అని సవాలు విసిరారు . ” ఆ ఇద్దరు అగ్ర నటులు సినిమా రంగంలోనే కాదు నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్లే . ” అని పోసాని పేర్కొన్నారు .