telugu navyamedia
సినిమా వార్తలు

ఆశాభోంస్లేకు పుట్టినరోజు శుభాకాంక్షలు : లతా మంగేష్కర్

Latha

ప్రముఖ సింగర్‌ ఆశాభోంస్లే నేడు 86వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరికి గానకోకిల లతామంగేష్కర్‌ ట్విట్టర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు నాచెల్లి పుట్టినరోజు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఆమెతో ఉంటాయి. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఆశాజీ పాడిన “దిల్‌ హీ తో హై” సినిమాలోని పాటను పోస్టు చేశారు. ఇంకా కాజోల్‌, రిషికపూర్‌, సింగర్‌ డాలర్‌ మెహెందీ ఆమెకు ట్విట్టర్‌ ద్వారా తమతో ఆమె అనుభవాలను పంచుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

పద్మవిభూషణ్ లతా మంగేష్కర్ కు కేంద్రం అరుదైన బిరుదుతో సత్కరించింది. తన తియ్యటి స్వరంతో 70 ఏళ్ల పాటు భారతావనిని అలరించిన లతా మంగేష్కర్ ను ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదుతో సత్కరించింది. ఈ నెల 28న లతా మంగేష్కర్ 90వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజున లతా మంగేష్కర్ కు ఈ బిరుదును ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Related posts