telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా వల్ల లవ్ బ్రేక్ అప్

jamesbond-girl

జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని.. ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని చెప్పింది ఈమె. ఓల్గాకు కరోనా సోకిందని తెలిసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దాంతో ఈమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు సూచనలు ఇస్తుంది. అలాగే తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్‌ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పింది ఓల్గా. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈమె ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

Related posts