telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బిజీ బిజీగా సల్మాన్ ఖాన్…

Salman

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రాధే సినిమా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత సల్మాన్ అంతిమ్ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాను మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఓ సిక్కు పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయుష్ శర్మా గ్యాంగ్ స్టర్ పాత్రలో చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని సల్మాన్ చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేల ఈ సినిమాను అనుకున్న వ్యవధిలో పూర్తి చేస్తే గత పది సంవత్సరాల్లో సల్మాన్ అత్యంత వేగంగా చేసిన సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమా కోసం సల్మాన్ ఇప్పటికే 30-35 రోజులు చిత్రీకరణ జరిపారు. అయితే ఈ సినిమా తరువాత సల్మాన్ ఖాన్ మరో బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ సినిమా పఠాన్‌లో అతిథి పాత్ర చేయనున్నారు. షారుక్ సినిమా కోసం సల్మాన్ దాదాపు 12-15రోజులు కేటాయించారంట. పఠాన్ ముగిసిన వెంటనే సల్మాన్ తన తదుపరి చిత్రం టైగర్3ని మొదలు చేయనున్నారు. టైగర్ సినిమాలో కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది… అనేది అలాగే ఇది అభిమానులను ఆకట్టుకుంటుందా… లేదా అనేది.

Related posts