telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రవితేజ లాయర్ గా కనిపించడం లేదంట..!

Raviteja

దాదాపు రెండు సంవత్సరాలకు పైగా హిట్ లేకుండా సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ జనవరిలో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని నిర్మాత సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్‌లుగా చేస్తున్నారు. అయితే ఈ మధ్యే రవితేజ మరో మరో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ 68వ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే అప్పటినుండి ఈ సినిమా పై ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు అని ప్రచార జరుగుతుంది. కానీ ఇప్పుడు అది అవాస్తవమని తేలిపోయింది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏదనేది తెలియదు కానీ లాయర్ పాత్ర మాత్రం కాదు అని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌, వివేక్‌ కూచిభోట్ల నిర్మించనున్నారు. కుమార్‌ బెజవాడ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Related posts