నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది ఒక రివేంజ్ డ్రామా అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారిని గ్యాంగ్ లీడర్ చిత్ర టీం హీరో నాని, చిత్ర నిర్మాతలు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామసమయంలో స్వామి వారి మూలవిరాట్టును దర్శించుకొనిమ్రొక్కులు చెల్లించుకున్నారు. దర్శాననంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్బచనంఅందించగా, టీటీడి అధికారులు స్వామి వారి పట్టువస్త్రాలను,తీర్ధప్రసాదాలను అందజేశారు. హీరో నాని మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల సంధర్భంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లిచుకున్నామని పేర్కోన్నారు.
Natural star @NameisNani visits Tirumala Temple.#GangLeader promotions in Tirupati@MythriOfficial @Vikram_K_Kumar @ActorKartikeya @anirudhofficial @priyankaamohan #Nani#GangLeaderFromSept13th pic.twitter.com/CEeL5tulUz
— Venkatesh V (@venkatesh_et) September 8, 2019