telugu navyamedia
సినిమా వార్తలు

కన్నడ రాజ్ కుమార్ కు నీకు పోలికుందా ?

“హీరో అంటే అటు నిర్మాతల క్షేమం , ఇటు ప్రేక్షకుల మంచి చెడ్డలు చూడాలి. అంతే కానీ ఒక సినిమా హిట్ అయ్యిందని ఎడాపెడా రేట్లు పెంచడం కాదు పవన్ కళ్యాణ్ ” అని పోసాని హితవు పలికారు. జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ “రిపబ్లిక్ ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు పోసాని కృష్ణ మురళి తీవ్రంగా ప్రతిస్పందించారు .

పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి | Posani Krishna Murali Fires On Pawan Kalyan. పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి

“కన్నడ రాజ్ కుమార్ కర్ణాటకలో సూపర్ స్టార్ మాత్రమే కాదు భారత దేశ సినిమా రంగంలోనే టాప్ స్టార్. ఒకసారి రాజ్కుమార్ తన నిర్మాతలు, పంపిణీదారులు ఇంటికి భోజనానికి ఆహ్వానించారు . రాజకుమార్ ఆహ్వానించడంతో ఎందరో సంతోషంగా వచ్చారు . భోజనం చేసిన తరువాత రాజ్ కుమార్ అందరికీ నమస్కరించి ” నేను చాలా కాలం నుంచి ఒకే పారితోషికం తీసుకుంటున్నా , ఎప్పుడూ పెంచలేదు , నా సినిమాలన్నీ విజయం సాధించి మంచి వసూళ్లు సంపాదించి పెడుతున్నాయి . నాకు కుటుంబం , బరువు , బాధ్యతలు వున్నాయి ” అంటూ వారివైపు చూశారు .

ఆయన నిర్మాతలు , పంపిణీదారులు ఆతృతగా చూస్తున్నారు , రాజ్ కుమార్ ఏమి చేబుతారా అని . అప్పుడు రాజ్ కుమార్ ” ఇక నుంచి నేను ఒక 25 వేలు పెంచుతాను , అది కూడా మీరంతా అంగీకరిస్తే ” అని వినమ్రగా చెప్పాడట .అందరు ఆయన అన్న మాటలకు చలించి పోయారట . “మీరు పాతిక వేలు పెంచుకోవడానికి మమల్ని పిలిచి అడగాలా ?” అన్నారట .

అందుకు రాజ్ కుమార్ బదులిస్తూ ” మీ వల్లనే కదా నేను నా కుటుంబంతో అన్నం తింటున్నాను. మీ వల్లనే కాదా నేను ఇల్లు కట్టుకున్నాను , ” అన్నారట .”అయ్యో ఎంత మాట సార్ , మీరు ఎంతయినా పెంచండి , మాకు అభ్యంతరం లేదు ” అని చెప్పారట . అందుకు రాజ్ కుమార్ వారందరికీ ధన్యవాదం చెప్పి ” ఒక్క పాతిక వేలు మాత్రం పెంచుతాను ” అని చెప్పారట.

Dr. Rajkumar | Kannada Actor | Personalities

“పవన్ కళ్యాణ్ రాజ్ కుమార్ కు నీకు ఏమైనా పోలిక ఉందా ? ఆయన సినిమా వాడే , నువ్వు సినిమావాడివే . నువ్వు సూపర్ స్టార్ అయితే ఆయన సూపర్ స్టారే . మరి మీ ఇద్దరిలో .. ప్రవర్తనలో .. సంస్కారం .. మానవత్వంతో ఎంత తేడా ? ” అని పోసాని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు .

Related posts