telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..

గులాబ్‌ తుపాను ప్రభావ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవైటు కార్యాలయాలకు మంగళవారం సెలవుదినంగా సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

As Cyclone Gulab nears coast, rain reported over coastal Andhra Pradesh, Odisha | India News,The Indian Express

అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, పురపాలక, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖలను సెలవు నుంచి మినహాయించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో విధి నిర్వహణలో ఉండాలని తెలిపారు. భారీ వర్షాలతో ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

Related posts