తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందన్నారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చాపచుట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు.
ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు బిక్కు మొఖాలేసుకోవడం ఖాయమని మంత్రి అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మనుగడ లేదని మంత్రి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామనీ, ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించుకుందామని అన్నారు.