telugu navyamedia
తెలంగాణ వార్తలు

బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రెండురోజు క్లాసులు బ‌హిష్క‌రించి ఆందోళ‌న‌లు..

*బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోన‌లు
*రెండురోజు క్లాసులు బ‌హిష్క‌రించిన విద్యార్ధులు..
*స‌మ‌స్య‌ను సీఎం దృష్టికి తీసుకెళతాం..
*మేంమున్నాంటూ కేసీఆర్ , స‌భిత‌ ట్వీట్లు..
*సీఎం మా క్యాంపు ఆఫీస్‌కు వ‌స్తేనే ఆందోళ‌న విర‌మిస్తాం

బాస‌ర‌ ట్రిబుల్ ఐటీలో రెండురోజు విద్యార్థులు ఆందోళన కొన‌సాగుతోంది. క్లాసులు బ‌హిష్క‌రించి కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు వేల సంఖ్యలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కళాశాల మెస్ ల లో భోజనం సరిగా ఉండటం లేదని, విద్యుత్ సమస్య , నీటి సమస్య తీవ్రంగా వెంటాడుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్ లు కూడా ఇవ్వకుండా చదువు పట్ల అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని, తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు.

అయితే ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులపై 8 వేల మంది విద్యార్థులు రోడ్డెక్కారంటూ… తేజగౌడ్‌ అనే విద్యార్ధి మంత్రి కేసీఆర్ కు ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ… సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. విద్యా నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్‌ ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన సబితా… వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.

అయితే ట్వీట్లు కాదు ..12 డిమాండ్ల‌కు పరిష్కారం కావాలంటూ విద్యార్ధులు అంటున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ విశ్వ‌విద్యాల‌యాన్ని సంద‌ర్శించి త‌గిన చ‌ర్య‌లు వెంట‌నే తీసుకోంట‌నే త‌మ ఆందోళ‌న‌ల విర‌మిస్తామ‌ని అంటున్నారు.

Related posts