telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇవాళ సిద్దిపేట్‌ జిల్లాకు తెలంగాణ సీఎం కేసీఆర్‌..కారణమిదే

kcr medaram tour

సీఎం కేసీఆర్ నేడు (మంగళవారం) సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం గజ్వేల్ నియోజకవర్గంలోని సంగారెడ్డి కాలువకు గోదావరి నీటిని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సీఎం టూర్‌కు సంబంధించిన పనులను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు.ఈ ఉదయం 10.30 కు వర్గల్ మండలం హౌసుల పల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 11.15 కు మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువలోకి విడుదల చేయనున్నారు. దీంతో 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాం సాగర్ లోకి గోదావరి జలాలు రానున్నాయి. అలాగే గోదావరి జలాల విడుదలతో 32 చెక్ డ్యాంలు, 0.62 టీఎంసిల నీరు నిల్వ కానుంది.

Related posts