telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వేసవిలో బార్లీ నీరు తాగితే కలిగే లాభాలు

Barli

సమ్మర్‌లో ఎండ వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. ఇందులో భాగంగా బార్లీ నీటిని ట్రై చేయొచ్చు. ముందుగా బార్లీ గింజలను కడిగి… 1 లీటర్ మంచినీటిని తీసుకుని అందులో బార్లీని వేయండి. ఈ నీటిని మీడియం మంటపై 20 నిమిషాల పాటు మరిగించండి. ఇలా చేయడం వల్ల బార్లీ గింజలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఈ టైమ్‌లో బార్లీ గింజల్లోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోసి అందులో కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగాలి. రోజు ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్‌ని తాగితే చాలు.. అదే విధంగా, బయటికి వెళ్లే ముందు, వెళ్లి వచ్చాక కూడా ఈ డ్రింక్‌ని హ్యాపీగా తాగేసేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. బార్లీ నీటిని తాగితే.. బాడీలోని చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ కూడా మెరుగ్గా మారుతుంది. బరువు కూడా తగ్గుతారు. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. దీని వల్ల అలసట, నీరసం కూడా దూరం అవుతుంది. బార్లీ నీటిని తాగడం వల్ల బాడీలోని వేడి బయటకి పోతుంది. దీంతో శరీరం చల్లగా మారుతుంది. అంతేకాకుండా వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. మూత్ర సమస్యలతో బాధపడేవారికి ఇది ఓ చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు. అంతేకాకుండా జీర్ణ సమస్యలు, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. విరేచనాలు అయినవారు ఈ నీటిని తాగడం వల్ల సమస్య తగ్గుతుంది. వయసు మళ్లిన వారు కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ నీటిని తాగడం వల్ల ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Related posts