telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్ : తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్

bjp party

తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి… ప్రచారం చేస్తున్నాయి. అయితే.. తాజాగా బీజేపీ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.  తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను ప్రకటించింది అధిష్టానం. కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది బీజేపీ హైకమాండ్. గతంలో కర్ణాటక సిఎస్ గా పనిచేసిన రత్నప్రభ…ఇటీవలె రిటైర్‌ అయ్యారు. ఈమె వైఎస్‌ హయాంలో ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో పాటు మరికొన్ని శాఖలు నిర్వహించారు రత్నప్రభ. తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి బీజేపీలో ప్రధానంగా నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. నలుగురిలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డ్‌ డీజీపీ కృష్ణ ప్రసాద్‌ ఉండగా.. మరొకరు తిరుపతి బీజేపీ నేత మునిసుబ్రమణ్యం ఉన్నారు. అయితే.. బీజేపీ హైకమాండ్‌ మాత్రం రత్నప్రభకే మొగ్గు చూపింది. కాగా.. తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్‌ 17న జరుగనుంది. వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు జనసేన పార్టీ బీజేపీకి మద్దతు తెలిపింది.

Related posts