యంగ్ హీరో తరుణ్ పదేళ్ల నుంచి ఎంత కష్టపడినా సక్సెస్ మాత్రం రాట్లేదు. దీంతో తరుణ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన “ఇది నా లవ్‌స్టోరీ’ తర్వాత మళ్లీ సినిమా చెయ్యలేదు తరుణ్. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. తాజాగా తరుణ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నాడని, మూడు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టాడని ప్రచారం జరుగుతోంది. వీటిల్లో రెండు వెబ్ ఫిల్మ్స్, ఒకటి థియేట్రికల్ మూవీ అని తెలుస్తోంది. ప్రస్తుతం తరుణ్ తో సినిమాలు తియ్యడానికి ప్రొడ్యూసర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తరుణ్‌తో చిన్న సినిమా తీసినా పెట్టుబడి తిరిగి వస్తుందా? అనే సందేహంలో ఉన్నారు నిర్మాతలు. కెరీర్ బిగినింగ్‌లో సూపర్ హిట్స్ కొట్టిన తరుణ్‌కి ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే వచ్చాయి. మరి ఇప్పుడు ఈ హీరో నిర్మాతగా మారబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో చూడాలి.
previous post
next post