telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగ చైతన్యలో మేనమామ పోలికలు… ఇవే అంటున్న వెంకటేష్

Venkatesh

విక్ట‌రీ వెంక‌టేష్, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘వెంకీమామ‌’. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి. సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్నినిర్మించారు. విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా విక్ట‌రీ వెంక‌టేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ‘మాములుగా మేనమామ పోలికలు అల్లుడికి వస్తాయంటారు! అలాంటి పోలికలు చైతులో మీరేమైనా అబ్జ‌ర్వ్‌ చేశారా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘చైతన్య కూడా సెట్లో నాలాగే క్వైట్‌గా ఉంటాడు. షూటింగ్‌కి కూడా కరెక్ట్ టైమింగ్‌కి వచ్చేస్తాడు. నాలాగే దూరంగా వెళ్లి నిలబడి ఏదో ఆలోచిస్తుంటాడు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు వీడు కూడా నాలాగే.. అని నవ్వుకుంటూ ఉంటాను’’ అని వెంకీ తెలిపారు.

Related posts