telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నా టీం ఇదే అంటున్న.. సీఎం ఉద్ధవ్

uddav takrey on excitement as upcoming cm

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ….ఆయన మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ రాలేదు. ఉద్దవ్‌తో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. తాజాగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారికి శాఖలను కేటాయించారు. శాఖల కేటాయింపులో ముందుగా ఊహించినట్టుగానే శివసేన కీలకమైన హోం శాఖను దక్కించుకుంది.

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ‘మహా వికాస్‌ ఆఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్‌సీపీ కీలకనేత అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి కేటాయించడంతో ఆ బాధ్యతలు అజిత్‌ పవార్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అజిత్‌కు ఆర్థిక శాఖ ఇచ్చి తాజాగా జయంత్‌ పాటిల్‌కు ఉపముఖ్యమంత్రి ఇస్తారని సమాచారం. కాగా, ఇప్పటికే స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత నానా పటోలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మంత్రులు, శాఖల వివరాలు:

* ఏక్‌నాథ్ షిండే (శివసేన)హోం, పట్టణాభివృద్ది, పర్యావరణ, పీడబ్య్లూడీ, పర్యాటకం, పార్లమెంటరీ వ్యవహారాలు
* సుభాష్ దేశాయ్ (శివసేన)-పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడాయువజన మంత్రిత్వ శాఖ
* నితిన్ రావత్ (కాంగ్రెస్)-గిరిజన, ఓబీసీ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, విపత్తు శాఖ
* బాలా సాహెబ్ థోరట్ (కాంగ్రెస్)-రెవెన్యూ, పాఠశాల విద్య, పశుసంవర్థక, మత్స్యశాఖ
* జయంత్‌పాటిల్ (ఎన్సీపీ)-ఆర్థిక, ప్రణాళిక, గృహనిర్మాణ, ఆహారసరఫరాలు, కార్మిక శాఖ
* ఛగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ)-గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, జలవనరులు, ఎక్సైజ్ శాఖ

Related posts