telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన 71 సంవత్సరాల “దాసి”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘీక చిత్రం రాజ్యం పిక్చర్స్ వారి చిత్రం “దాసి ” 26-11-1952 విడుదలయింది.


నిర్మాత సి.లక్ష్మీరాజ్యం గారు రాజ్యం పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు ఎల్.వి.ప్రసాద్ గారి దర్శక పర్యవేక్షణలో దర్శకుడు సి.వి.రంగనాథదాస్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: వెంపటి సదాశివబ్రహ్మాం, పాటలు: ఆచార్య ఆత్రేయ, సంగీతం:
సి.ఆర్.సుబ్బురామన్, సుసర్ల దక్షిణామూర్తి, ఛాయా గ్రహణం: రహమాన్, కళ: టి.వి.ఎస్.శర్మ,
నృత్యం: కృష్ణమూర్తి, ఎడిటింగ్: పి.మాణిక్యం, ఆంఫించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, లక్ష్మీరాజ్యం, రేలంగి, సూర్యకాంతం, చలం,
తెలుగు కనకం, శాంతకుమారి, సూర్యకాంతం, శివరావు,.దొరస్వామి నాయుడు, సింహాచలం,
తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బురామన్, సుసర్ల దక్షిణామూర్తి ల సంగీత సారధ్యంలో “జోర్సే ఛలో నా రాజా ఘోడా హవాకే ఘోడా, “చిట్టితల్లి నవ్వవే చిన్నారి పాపవే”
“కళకళలాడే పండగ నేడే బిరబిర రారండి” వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఈ చిత్రం పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి,
3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది.
100 రోజులు ఆడిన కేంద్రాలు:-
1. గుంటూరు — న్యూ బాంబే టాకీస్ (రాధాకృష్ణ),
2. విజయవాడ — శ్రీరామా టాకీస్ (105 రోజులు),
3. రాజమండ్రి — శ్రీరామా
ఈ చిత్రం శతదినోత్సవ వేడుకలు విజయవాడ – శ్రీరామా టాకీస్ లో 05-03-1953 న ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
నిర్మాత సి.లక్ష్మీరాజ్యం గారి భర్త శ్రీధరరావు గారు ఈ చిత్రాన్ని “వెలైకారి మగల్” (పేరుతో తమిళంలో రీమేక్ చేసి 14-01-1953 న విడుదల చేశారు.
ప్రముఖ నటులు చలం ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు…

Related posts