telugu navyamedia
రాజకీయ వార్తలు

అయోధ్య కేసు … వాదనలు ముగిసినా.. తీర్పు వెల్లడించలేదు ..

ayodya case hearing will end tomorrow

ఎప్పటి నుండో జీడిపాకం లాగ సాగిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు 40 రోజుల పాటు సాగించిన రోజువారీ విచారణ బుధవారంతో ముగిసింది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నవంబర్ 17వ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో సంబంధిత పార్టీలు లిఖిత పూర్వక నివేదనలు అందజేసేందుకు సుప్రీం ధర్మాసనం మరో మూడు రోజుల గడువు ఇచ్చింది. అయోధ్య కేసులో బుధవారంనాడు విచారణ సందర్భంగా, ఈ కేసుకు ముగింపు పలకనున్నట్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు.

ఈ కేసులో వాదనలు నేటి సాయంత్రం 5 గంటలతో ముగుస్తాయని మొదట చెప్పారు. విచారణ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటి వరకూ జరిగింది చాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి సారధ్యం వహిస్తున్న రంజన్ గొగోయ్ అన్నారు. అయితే, ఆయన చెప్పిన గడువు కంటే గంట ముందుగానే మధ్యాహ్నం 4 గంటలకు విచారణ ముగిసింది. ఈ కేసులో ఇవాల్టితో 40 రోజుల పాటు రోజవారీ విచారణను ధర్మాసనం చేపట్టింది. నవంబర్ 17న సీజేఐ పదవీ విరమణ చేయనుండడంతో ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts