ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. . అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు తదితరులు తమ్మినేనిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు.
అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత సందాయాలను పాటించలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్పీకర్‌ను చైర్‌లో కూర్చోబెట్టే విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబును ఆహ్వానించలేదన్నారు. సభలో ఫలప్రదమైన చర్చలకు అవకాశం ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అధికార, విపక్షాలను స్పీకర్ సమదృష్టితో చూస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు: దివ్యవాణి