telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ ప్రొటెం స్పీకర్‌గా … శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు… !

ycp party

ఏపీసీఎం జగన్ తన నిర్ణయాలతో కొత్త సమీకరణాలను తెర మీదకు తెస్తున్నారు. ఈ నెల 12 నుండి ప్రారంభ మయ్యే ఏపీ శాసనసభా సమావేశాల్లో సభాపతి స్థానంలో ఉండాల్సిన ప్రొటెం స్పీకర్‌ను జగన్ ఎంపిక చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన పేరు తెర మీదకు తెచ్చారు. ఆ నాలుగు పేర్ల చుట్టే ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుందనే అంచనాలు ఉండగా..జగన్ వాటిని తారుమారుచేసే నిర్ణయం తీసుకుని అంచారిని ఆశ్చర్యపరిచారు. విజయనగర జిల్లా బొబ్బిలి నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఏపీ ప్రొటెం స్పీకర్‌గా నియమితులు కానున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఆయన పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి అనుభవించిన సుజయ కృష్ణ రంగారావును తాజా ఎన్నికల్లో శంబంగి ఓడించారు.

వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నకైన శంబంగి ప్రొటెం స్పీకర్‌గా శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్‌ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రొటెం స్పీకర్‌గా తొలుత నలుగురు పేర్లు వినిపించాయి. అందులో ఎమ్మెల్యేగా ఆరు సార్లు ఎన్నికైన నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి..ఆనం రామనారాయణ రెడ్డి.. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి..గోరంట్ల రూరల్ నుండి గెలిచిన టీడీపీ గెమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్లు వినిపించాయి. వాస్తవంగా వీరందరి కంటే ఏడు సార్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత సభ లో అందరి కంటే సీనియర్‌. ఆయనే ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సి ఉండటంతో..ఆయన ముందుకు వచ్చే అవకాశం లేదు. విజయనగరం జిల్లాలోని మొత్తం 9 స్థానాలను వైసీపీ గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. అందుకే ఆ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఆ జిల్లా నుండి నలుగురి పేర్లు వినిపిస్తున్నా.. ఇద్దరికి స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 12న ఉదయం ప్రొటెం స్పీకర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts