telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రభుత్వం వర్సెస్ ఈసీగా ఏపీ ఎన్నికలు…

Nimmagadda ramesh

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్‌ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించింది ఏపీ ఎస్‌ఈసీ… ఇవాళ ఉదయే ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏదేమైనా ఎన్నికలు వెళ్తామని ప్రకటించారు.. అయితే, ఎస్‌ఈసీ నిర్ణయంపై సంచలన ప్రకటన చేసింది ఏపీ ఎన్జీవోస్‌ సంఘం… అవసరమైతే సమ్మె వెళ్తామని వ్యాఖ్యానించారు ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి.. కరోనా టీకాలు వేశాకే ఎన్నికల విధుల్లోకి వెళ్తామని స్పస్టం చేసిన ఆయన.. ఎన్నికల విధుల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.. మా ప్రాణాల తర్వాతే మా ఉద్యోగం అని కుండబద్దలు కొట్టిన ఆయన.. మా శవాల మీద నడుచుకుంటూ వెళ్లి ఎన్నికలు నిర్వహిస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు.. అవసరమైతే సమ్మెకు సిద్ధం… ఎన్నికలను బహిష్కరిస్తామని తెగేసి చెప్పారు చంద్రశేఖర్‌రెడ్డి. ఇక, ఎస్ఈసీ మాటలు బాధ కలిగిస్తున్నాయి.. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని.. దుష్పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వ్యాక్సిన్ పూర్తయ్యాక ఎన్నికల్లో పాల్గొంటామని కోరినా ఎస్ఈసీ వినలేదని.. కానీ, అద్దాలు చాటున మాట్లాడిన ఎస్ఈసీకి కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.. మేం జాగ్రత్త పడకూడదా..? అని ప్రశ్నించారు. ఉద్యోగులను టర్మినేట్ చేస్తాం.. సస్పెండ్ చేస్తాం అనే ఉద్దేశ్యం ఎస్ఈసీలో కన్పిస్తోందని.. ఎస్ఈసీ రిటైరయ్యాక.. ఆయన కంటే గొప్పవారు ఎస్ఈసీ సీట్లో కూర్చుంటారన్నారు.

Related posts