బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయన్ని కంగనా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుందని, కోవిడ్ ఒక చిన్న ఫ్లూ మాత్రమేనని, దాన్ని త్వరలోనే అంతం చేస్తానని తెలుపుతూ ఆమె యోగా చేస్తున్న పిక్ ను షేర్ చేసింది. అయితే ప్రతిరోజూ దాదాపు 4000 మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనాను చిన్న ఫ్లూ అంటూ కంగనా తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ ఇన్స్టాగ్రామ్ ఆమె పోస్ట్ ను తొలగించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ‘నేను కోవిడ్ ను నాశనం చేస్తానని పోస్ట్ చేయడంతో కొందరు హర్ట్ అయ్యారట. ఇప్పటివరకూ టెర్రరిస్టులకు, కమ్యూనిస్టులకు మద్దతుదారులు ఉంటారని ట్విట్టర్ లో విన్నాను. కానీ ఇన్స్టాలో కరొనకు ఫ్యాన్ క్లబ్ ఉంది. ఇన్స్టాకు వచ్చి కొన్ని రోజులే అవుతోంది. కానీ ఇక్కడ ఇంకో వారానికి మించి ఉంటానని అనుకోవడం లేదు’ అంటూ పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా తనను బ్యాన్ చేయడం గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నానని, అది తనకు గౌరవ బ్యాడ్జ్ అవుతుందని పేర్కొంది. అయితే కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ ను ఆ సంస్థ శాశ్వతంగా తొలగించిన విషయం తెలిసిందే.
previous post
next post