telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య వారసుడు…

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. హీరోగా ఎంట్రీ జూన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజైన 10న మోక్షజ్ఞ సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ క్లారిటీ మాత్రం లేదు. నందమూరి అభిమానులు ఈ విషయంలో ఎన్నో ఊహలు ఊహించారు. అయితే దీనికి సంబంధించి తాజాగా మరో వార్త నడుస్తోంది. అయితే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలన్న విషయంలో బాలయ్య పట్టుదలతో ఉన్నాడట. అందుకని ట్రైనర్లను పెట్టి మరి మోక్షజ్ఞ లుక్స్ కోసం పెట్టించాడట. అంతేకాకుండా అతడి నటన కోసం ప్రత్యేకంగా నిపుణులను కూడా తెప్పించారు. అంతేకాకుండా మోక్షజ్ఞ లాంచ్ కోసం బాలయ్య దర్శకధీరుడు రాజమౌళిని కలిశాడట. మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాలో కొంత భాగాన్ని జక్కన్న రాశాడని కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మోక్షజ్ఞను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంచ్ చేయనున్నాడట. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందనేది చూడాలి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్వకత్వంలో సినిమా చేస్తున్నాడు. వీరి కాంబోలో ఇది మూడో సినిమా కావడం చాలా స్పెషల్‌గా ఉంది. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.

Related posts