బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఒకవైపు ఓం రౌత్ ఆదిపురుష్‌తో పాటు స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు దగ్గర దగ్గర సమయాల్లో ప్రారంభం కానున్నాయి. దాంతో ప్రభాస్ ఏ సినమా షూటింగ్‌లో పాల్గొంటాడో తెలీదు. ముందుగా ప్రభాస్ తన సరికొత్త సినిమా రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే ఆదిపురుష్ మొదలు పెట్టాల్సిఉంది. ఈ సినమా దాదాపు రూ.3 వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. అదే స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలు ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లు బిజీ కానున్నారట. వీరితో పాటు మరికొందరు సీనియర్ స్టార్ నటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రీకరణ ముంబై ఫిల్మ్ స్టూడియోలో చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఓం రౌత్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో వాస్తవ చిత్రీకరణ కన్నా ఎఫెక్ట్స్ ఎక్కువ సమయం చేయాల్సి ఉంటుంది.
previous post