telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి బన్నీ సాంగ్ కు స్టెప్పులేసి వార్నర్

David-Warner

లాక్‌డౌన్ కార‌ణంగా క్రికెటర్ వార్న‌ర్ టిక్ టాక్ తో బాగా టైం పాస్ చేస్తున్నారు. డైలాగ్స్‌కి యాక్ష‌న్ చేయ‌డం, లేదంటే పాట‌ల‌కి స్టెప్స్ వేయ‌డం చేస్తూ నెటిజ‌న్స్‌ ను ఆకట్టుకుంటున్నాడు వార్న‌ర్. అయితే ఈ ఆస్ట్రేలియా ఓపెన‌ర్ టాలీవుడ్ హీరో బ‌న్నీ నటించిన అల వైకుంఠ‌పుర‌ములోని సాంగ్స్‌కి ఎక్కువ‌గా టిక్‌టాక్‌లు చేస్తుండ‌డంతో బన్నీ ఫాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య డేవిడ్ వార్నర్ “అల వైకుంఠపురంలో” చిత్రంలోని బుట్ట‌బొమ్మ‌, రాములో రాములా పాట‌కి త‌న‌దైన స్టైల్‌లో స్టెప్స్ వేసి అల‌రించాడు. బ‌న్నీ, థ‌మ‌న్ లు కూడా ఆయ‌న డ్యాన్స్‌కి ఫిదా అయ్యారు. తాజాగా మ‌రోసారి రాములో రాములా సాంగ్ కి డాన్స్ వేసి మెప్పించారు. ఇంతక‌ముందు ఫ్యామిలీతో క‌లిసి స్టెప్పులు వేసిన వార్న‌ర్ ఈసారి సోలోగా స్టైలిష్ గా ఫినిష్ చేశాడు. డేవిడ్ వార్నర్ వీడియోలకు మంచి స్పందన వస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related posts