telugu navyamedia
సినిమా వార్తలు

సినీ పరిశ్రమ మూగబోయింది : ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థీవ దేహం

ప్రముఖసినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.ఈనెల 24న సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మంగళవారం నవంబర్ 30న సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు.

కిమ్స్ నుంచి నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం తరలించారు. అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్​లోని ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని ఉంచారు. ఆయనకు సినీ ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

నేడు(బుధవారం) మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చిరంజీవి

ఆయనతో చివరగా మాట్లాడిన వ్యక్తి నేనే. అది నా అదృష్టం. ఆ తర్వాత ఆయన ఫోన్ ఆఫ్ చేసి ఆస్పత్రిలో చేరారు. మంచి చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తానని చెప్పాను. ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఎప్పుడూ నన్ను మిత్రమా అని పిలిచేవారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవడం చిత్రపరిశ్రమకు తీరనిలోటు. మంచి మిత్రుడిని కోల్పోయాను. సిరివెన్నెల స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. నా కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు. ‘నడిచే నక్షత్రం’ అంటూ నాకోసమే రాశానని అనేవారు. ఆయన జ్ఞాపకార్థం మేం ఏదో ఓ కార్యక్రమం నిర్వహిస్తాం” అని హీరో చిరంజీవి చెప్పారు.

వెంక‌టేశ్‌..

నా కెరీర్​ ప్రారంభం నుంచి సిరివెన్నెలతో పనిచేశాను. ‘స్వర్ణకమలం’ నుంచి మొన్న వచ్చిన ‘నారప్ప’ వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. సాహిత్య రంగంలో మనం ఓ లెజెండ్​ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి- విక్టరీ వెంకటేశ్

అల్లు అర్జున్

సిరివెన్నెలకు అల్లు అర్జున్ నివాళిసిరివెన్నెల భౌతికకాయానికి హీరో అల్లు అర్జున్ నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. “శాస్త్రిగారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా కుటుంబసభ్యుల తర్వాత కాళ్లకు నమస్కారం చేసే అతి తక్కువమంది వ్యక్తుల్లో సీతారామశాస్త్రి ఒకరు. ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని అల్లు అర్జున్ అన్నారు.

1

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా ఆయన పార్థివదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చూసి సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం సిరివెన్నెలకి నివాళులు అర్పించారు తనికెళ్ళ. తనికెళ్లతో పాటే దర్శకులు విజయ్ భాస్కర్, డైరెక్టర్ మారుతి, హీరో వెంకటేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, సింగర్ సునీత, కూడా సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇంకా పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా కడసారి నివాళులు అర్పిస్తున్నారు.

నేడు(బుధవారం) మహాప్రస్థానంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related posts