telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మనిషిని పోలిన చేప… చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే…!

Fish

అచ్చం మనిషి లాంటి మొహంతో ఉన్న ఓ చేప వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చేపను చూసిన వారంతా ఒక్కసారిగా షాకవుతున్నారు. చైనాలోని కున్‌మింగ్ ప్రాంతంలో ఉన్న ఓ సరస్సులో ఈ చేప కనిపించినట్టు వీడియో తీసిన వ్యక్తి చెబుతున్నాడు. తాము ఆ ప్రాంతంలో పర్యటించడానికి వెళ్లామని.. సరస్సులో ఈ చేపను చూసి ఆశ్చర్యపోయామని పర్యాటకుడు చెప్పాడు. కాగా, ఈ వింత చేప వీడియోను పర్యాటకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా ట్రెండింగ్ అయిపోయింది. సరిగ్గా మనిషికి ఉన్నట్టే కళ్లు, ముక్కు, నోరు ఈ చేపకు ఉండటం విశేషం. పైనున్న వీడియోలో ఇవన్నీ గమనించవచ్చు. ఈ చేపను తినాలంటే ధైర్యం ఉండాలని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఈ చేపను యానిమేషన్ సినిమాలలో కనిపించే ఏలియన్ చేపలతో పోల్చుతున్నారు.

Related posts